భారతీయులను స్వదేశానికి పంపడానికి కృషి చేసిన సంఘాలు

- May 23, 2020 , by Maagulf
భారతీయులను స్వదేశానికి పంపడానికి కృషి చేసిన సంఘాలు

యూ.ఏ.ఈ:ప్రస్తుతం కరోనా మహమ్మారితో  వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకరావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన  వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ లో 5 నెలల జీతాలు ఇవ్వక యాజమాన్యం కంపెనీ మూసివేసి వెళ్లిపోవడంతో గల్ఫ్ కార్మికుల జీవితాలు అతలాకుతులమై తినడానికి తిండి లేక దుబాయ్ కోర్ట్ యొక్క తీర్పు కోసం వేచి చూస్తూ గత 3 నెలలుగా ఇబ్బందులను ఎదుర్కొంటు ఇక్కడే చిక్కుకొన్న గల్ఫ్ కార్మికులు దర్శనాల వర్ణాచారి ,కట్టాజి రాజులు మరియు ఆదిలాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంలో భార్య కూతురుని కోల్పోయిన పోతరాజుల శ్రీనివాస్ లు వారి సమస్యలను FRIENDS OF INDIA ( FOI),యూ.ఏ.ఈ  తెలుగు ప్రతినిధులు  గంగారాం ,హరీష్ ,వెంకన్న, శ్రీనివాసరెడ్డి పాత రమేష్ ల దృష్టికి తీసుకురాగా వారు FOI కోర్ టీం  సభ్యులు విపిన్ వేణుగోపాల్ ,కార్తీక్ లతో మాట్లాడటం జరిగింది. వారు తక్షణమే స్పందించి సంస్థ ద్వారా ప్రయాణ చార్జీలను చెల్లించాలని నిర్ణయించి  శ్రీనివాస్, వర్ణాచారి,రాజుల  స్వదేశీ ప్రయాణానికి కావలిసిన విమాన టిక్కెట్లను మరియు చార్జీలను FOI  ( ఎఫ్ .ఓ. ఐ)సేవ సంస్థ ద్వారా  చెల్లించడం జరిగింది. అంతే కాకుండా దుబాయ్ లో పనిచేసి డబ్బులురాక నష్టపోయి వర్ణాచారి రాజు మరియు రోడ్డు ప్రమాదంలో భార్య కూతురుని కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబాలను మరియు గల్ఫ్ దేశాల్లో నష్టపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను విధిగా ప్రభుత్వం ఆదుకోవాలని  FOI ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞపి చేసారు.

ప్రస్తుతం కష్టాలలో ఉన్న తమకు ప్రయాణ చార్జీలను FOI వారు చెల్లించడం ఎంతో సంతోషాన్నిచ్చింది మేము ఎక్కడవున్నా FOI  వారికి రుణపడి ఉంటాము  అని  శ్రీనివాస్ వర్ణాచారి రాజులు  FOI కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . తమ స్వదేశీ ప్రయాణానికి అన్నివిధాలుగా సహకరించి ఆదుకున్నందుకు కాన్సులెట్ అధికారులకు మా గల్ఫ్ టీం కి ETCA సభ్యులకు  ధన్యవాదాలు తెలిపారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com