సౌదీ వ్యాప్తంగా పూర్తిస్థాయి కర్‌ఫ్యూ అమల్లోకి

సౌదీ వ్యాప్తంగా పూర్తిస్థాయి కర్‌ఫ్యూ అమల్లోకి

రియాద్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ తలాల్‌ అల్‌ షల్హౌబ్‌, సౌదీ అరేబియా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిస్థాయి కర్‌ఫ్యూ అమల్లోకి వచ్చిందని చెప్పారు. మే 27వ తేదీ వరకూ ఈ పూర్తిస్థాయి కర్‌ఫ్యూ అమల్లో వుంటుంది. రోజులో 24 గంటలూ కర్‌ఫ్యూ అమల్లో వుంటుందని తలాల్‌ పేర్కొన్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌, పూర్తిస్థాయిలో కర్‌ఫ్యూని అమలు చేస్తున్నట్లు చెప్పారాయన. ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా సెక్యూరిటీ ఫోర్సెస్‌ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 999 నెంబర్‌కి ఫోన్‌ చేయొచ్చని తలాల్‌ సూచించారు. మక్కా రీజియన్‌లోనివారు 911 నెంబర్‌కి ఫోన్‌ చేయాల్సి వుంటుంది. సొంత డెలివరీ వాహనాల ద్వారా రెస్టిరెంట్స్‌ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు అందించవచ్చునని అధికారులు చెబుతున్నారు.

Back to Top