పెరిగిన చలితో హీటర్లకు పెరిగిన డిమాండ్‌

- January 30, 2016 , by Maagulf
పెరిగిన చలితో హీటర్లకు పెరిగిన డిమాండ్‌

వాతావరణంలో మార్పులు 'హీటర్స్‌' విక్రయదారులకు ఆనందాన్నిస్తోంది. అలాగే చలి తీవ్రత కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. చలి, జలుబుతో కూడిన జ్వరాలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు హీటర్లను ఆశ్రయించడం జరుగుతుంది. దాంతో మార్కెట్‌లో హీటర్లకు డిమాండ్‌ విపరీతంగా పరిగిపోయింది. 100 ఖతారీ రియాల్స్‌ నుంచి హీటర్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. 24 హీటర్లను కొద్ది గంటలోనే విక్రయించినట్లు ఓ ఔట్‌లెట్‌లోని సేల్స్‌మెన్‌ చెప్పాడు. ఒక్కో హీటర్‌ ధర 115 ఖతారీ రియాల్స్‌. ఫ్యాన్‌తో కూడిన హీటర్‌ ధర 229 ఖతారీ రియాల్స్‌ దాకా ఉంది. ఈ ధరలో 20 హీటర్లను ఆ సేల్స్‌మెన్‌ విక్రయిండం జరిగింది. అలాగే వస్త్ర దుకాణాల్లో స్వెటర్స్‌కి కూడా డిమాండ్‌ పెరిగిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com