కరోనా వైరస్‌:కువైట్‌లో భారత నర్స్‌ మృతి

- May 25, 2020 , by Maagulf
కరోనా వైరస్‌:కువైట్‌లో భారత నర్స్‌ మృతి

కువైట్‌:భారత నర్స్‌ ఒకరు కువైట్‌లో కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నమ్మ చాకో (59)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ అన్నమ్మ చాకో, అల్ షాబ్ మెడికల్ సెంటర్‌లో నర్స్‌గా సేవలందిస్తున్నారు.ముబారక్ ఆసుపత్రి ‌ ‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్‌లో కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ప్రకారం అన్నమ్మ చాకో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com