శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
- May 25, 2020
హైదరాబాద్:నేటి నుండి భారత దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన విమానాశ్రయంను సందర్శించారు. అక్కడున్న ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రయాణీకుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, టచ్ చేయకుండా..సెన్సార్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణాలు సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని, ఈ యాప్ ఉన్న వారినే లోపలికి అనుమతినిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని సెక్యూర్టీ పరంగా, ఆరోగ్య పరంగా విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతినిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల్ల క్వారంటైన్ అవసరం ఉండదన్నారు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయంకు మంజూరైన 30 విమానాల్లో 15 శంషాబాద్ నుంచి బయలుదేరేవి కాగా...మరో 15 ఇక్కడకు చేరుకుంటాయి. ప్రయాణీకులు విమానానికి సంబంధించిన ఆధారాలను దగ్గ ఉంచుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు