యూఏఈలో పూర్తి స్థాయిలో పాస్ పోర్ట్ సేవలు ప్రారంభం
- May 27, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవలు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో ఇక నుంచి పాస్ పోర్ట్ ఆఫీసుల సాధారణ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచే కార్యాకలాపాలు ప్రారంభం అయ్యాయి. అయితే..పాస్ పోర్ట్ ఆఫీసులకు వచ్చే వారు కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
యూఏఈలో పాస్ పోర్ట్ సేవలను అందించే బీఎల్ఎస్ కేంద్రాలు వివరాలివి:
బుర్ దుబాయ్ లోని అల్ ఖలీజ్ సెంటర్; డీరా సిటీ సెంటర్ ఎదురుగా ఉన్న జీనా భవనం; షార్జాలోని కింగ్ ఫైసల్ వీధిలో అబ్దుల్ అజీజ్ మాజిద్ భవనం; షార్జా ఇండియన్ అసోసియేషన్; ఫుజైరాలోని ఇండియన్ సోషల్ క్లబ్; బిఎల్ఎస్ రాస్ అల్ ఖైమా; అజ్మాన్ ఇండియన్ అసోసియేషన్; మరియు ఉమ్ అల్ క్వెయిన్ లోని కింగ్ ఫైజల్ రోడ్ లోని అల్ అబ్దుల్ లాతీఫ్ అల్ జరూని భవనం.
పైన పేర్కొన్న అన్ని కేంద్రాల్లో అల్ ఖలీజ్ సెంటర్ మినహా మిగిలిన అన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయి. అల్ ఖలీజ్ సెంటర్ లో మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







