సేఫ్టీ రూల్స్ ఉల్లంఘన: లేడీస్ అండ్ జెంట్స్ సెలూన్స్ మూసివేత
- May 28, 2020
షార్జా:షార్జా ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఎస్ఇడిడి), పలు లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ సెలూన్స్ని ఎమిరేట్‌లో మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ ప్రికాషనరీ మెజర్స్ పాటించకపోవడంతో వీటి మూసివేతకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఇడిడి ఈ మేరకు పలు ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది. స్టాఫ్ అలాగే విజిటర్స్ మాస్క్‌లు ధరించడం, గ్లోవ్స్ ధరించడం చేయాల్సి వుంది. సర్వీస్ కోసం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. వీటితోపాటుగా సెలూన్‌ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి వుంటుంది. ఏ సంస్థ అయినా సంబందిత నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్ఇడిడి హెచ్చరించింది. ఉల్లంఘనలకు సంబంధించి సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేయడానికి 80080000ని సంప్రదించాలని ఎస్ఇడిడి సూచించింది. షార్జా ఎకనమిక్ సోషల్ మీడియా అకౌంట్ @Sharjaheconomic అలాగే కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ (www.sedd.ae) ని కూడా సందర్శించవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు