మాస్క్‌లకు సంబంధించి కొనసాగుతున్న జరీమానాలు

మాస్క్‌లకు సంబంధించి కొనసాగుతున్న జరీమానాలు

మస్కట్:రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పెద్ద సంఖ్యలో జరీమానాలు అలాగే వయొలేషన్‌ నోటీసుల్ని పలువురు వ్యక్తులకు జారీ చేయడం జరిగింది. సుప్రీం కమిటీ డెసిషన్స్‌ని పాటించనివారికి జరీమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు అధికారులు. మాస్క్‌లు ధరించనివారికి ఎక్కువగా జరీమానాలు జారీ అవుతున్నాయి. నిబంధనలు పాటించని పలు బిజినెస్‌లకు కూడా దహిరా గవర్నరేట్‌ పరిధిలో జరీమానాలు విధించారు. షర్కియాలో పలువురు పౌరులు మాస్క్‌లు ధరించకపోవడంతో జరీమానాలు జారీ చేశారు. పబ్లిక్‌ గాదరింగ్స్‌కి పాల్పడుతున్నవారికి కూడా జరీమానాలు విధించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. సౌత్‌ అల్‌ బతినా సహా పలు గవర్నరేట్స్‌లో ఈ జరీమానాలు విధించడం జరిగింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)

Back to Top