కోవిడ్‌పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్
- May 30, 2020
మనామా:కోవిడ్-19 అసలు లేనే లేదంటూ ఓ వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్న దరిమిలా బహ్రెయిన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కంబాటింగ్ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ అందించిన సమాచారం మేరకు విచారణ చేపట్టి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తన సోషల్ మీడియా పేజీలో అసలు కోవిడ్19 లేదనీ, ఇదంతా అబద్ధమనీ, ప్రజల్ని దోచుకునేందుకే కోవిడ్19 పేరుతో హడావిడి చేస్తున్నారనీ పేర్కొన్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ నవాఫ్ అల్ అవాది చెప్పారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బహ్రెయిన్‌లో పలు చర్యలు చేపట్టారు. దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్స్ వద్ద తనిఖీలు నిర్వహించడం, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ విధించడం తదితర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







