కువైట్:ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మార్కెట్లకు అనుమతి
- May 31, 2020కువైట్ సిటీ:కరోనా సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవనం దిశగా కువైట్ లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. లాక్ డౌన్ నిబంధనల నుంచి అంచెలంచెలుగా వివిధ రంగాలకు మినహాయింపులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కర్ఫ్యూను రాత్రి సమయానికే పరిమితం చేసిన కువైట్ మున్సిపాలిటీ..ఉదయం వేళలలో ఇక నుంచి సూపర్ మార్కెట్లకు అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మార్కెట్లు ఓపెన్ చేసుకోవచ్చని మున్సిపాలిటి అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని కూడా తెలిపారు. అయితే..కర్ఫ్యూ లేకుండా లాక్ డౌన్ మాత్రమే అమలులో ఉన్న ప్రాంతాల్లో మాత్రం మార్కెట్లు 24 గంటలు ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే కువైట్ హైపర్ మార్కెట్ లులు..తమ బ్రాంచులు నిబంధనలకు లోబడి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు తెరిచి ఉంటాయని ప్రకటించింది. అయితే...ఖైతాన్, ఫర్వానియాలోని లులు ఎక్స్ ప్రెస్ మాత్రం 24 గంటలు తెరిచే ఉంటాయని కూడా లులు హైపర్ మార్కెట్ ప్రతినిధులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..