అబుధాబి:ట్యాక్సీ డబ్బుల చెల్లింపునకు కొత్త యాప్ ప్రారంభం

అబుధాబి:ట్యాక్సీ డబ్బుల చెల్లింపునకు కొత్త యాప్ ప్రారంభం

అబుధాబి:ట్యాక్సీ ఛార్జీలను చెల్లించేందుకు రవాణా శాఖ అధికారులు అబుధాబి ట్యాక్సీ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా డబ్బుల చెల్లింపు మరింత సులభతరం కానుంది. యాప్ సేవలను వినియోగించుకునేందుకు వినియోగదారులు..ముందుగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలను పొందపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులను యాప్ ద్వారా చెల్లించొచ్చు. లేదంటే ట్యాక్సీ మీటర్ పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా కూడా ఛార్జీలను చెల్లించవచ్చు. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Back to Top