కువైట్:ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మార్కెట్లకు అనుమతి

కువైట్:ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మార్కెట్లకు అనుమతి

కువైట్ సిటీ:కరోనా సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవనం దిశగా కువైట్ లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. లాక్ డౌన్ నిబంధనల నుంచి అంచెలంచెలుగా వివిధ రంగాలకు మినహాయింపులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కర్ఫ్యూను రాత్రి సమయానికే పరిమితం చేసిన కువైట్ మున్సిపాలిటీ..ఉదయం వేళలలో ఇక నుంచి సూపర్ మార్కెట్లకు అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మార్కెట్లు ఓపెన్ చేసుకోవచ్చని మున్సిపాలిటి అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని కూడా తెలిపారు. అయితే..కర్ఫ్యూ లేకుండా లాక్ డౌన్ మాత్రమే అమలులో ఉన్న ప్రాంతాల్లో మాత్రం మార్కెట్లు 24 గంటలు ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే కువైట్ హైపర్ మార్కెట్ లులు..తమ బ్రాంచులు నిబంధనలకు లోబడి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు తెరిచి ఉంటాయని ప్రకటించింది. అయితే...ఖైతాన్, ఫర్వానియాలోని లులు ఎక్స్ ప్రెస్ మాత్రం 24 గంటలు తెరిచే ఉంటాయని కూడా లులు హైపర్ మార్కెట్ ప్రతినిధులు వెల్లడించారు. 

Back to Top