కోవిడ్-19:సౌదీ అరేబియా లో ‌మ‌సీదులు పునఃప్రారంభం

- May 31, 2020 , by Maagulf
కోవిడ్-19:సౌదీ అరేబియా లో ‌మ‌సీదులు పునఃప్రారంభం

రియాద్‌: సౌదీ అరేబియాలో దాదాపు 2 నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌సీదులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా కేసులు పెరిగిపోవ‌డంతో సౌదీ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించింది. అయితే, ఇటీవ‌ల కేసుల సంఖ్య కొంచెం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో స‌డలింపులు ఇస్తున్న‌ది.అందులో భాగంగానే ఇటీవ‌ల జూన్ 21న క‌ర్ఫ్యూ గ‌డువు ముగిసేలోపు మ‌క్కా మిన‌హా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మూడు ద‌శ‌ల్లో ఆంక్ష‌లు ఎత్తివేస్తామ‌ని సౌదీ అరేబియా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఇవాళ మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. 

అయితే, మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల‌కు వెళ్లేవారికి సౌదీ స‌ర్కారు కొన్ని నిబంధ‌న‌లు విధించింది. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, ప్రార్థ‌న‌ల కోసం ఎవ‌రి మ్యాట్‌ను వారే తెచ్చుకోవాల‌ని సూచించింది. అదేవిధంగా ఒక‌రికి ఒక‌రు క‌నీసం రెండు మీట‌ర్ల దూరం క‌చ్చితంగా పాటించాల‌ని సూచించింది. ఒక‌రికి ఒక‌రు ఎట్టి ప‌రిస్థితుల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోరాద‌ని ఆదేశించింది. ఎవ‌రైన ఈ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని  ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com