ఒమన్ లో సాధారణ ఆరోగ్య సేవలు తిరిగి ప్రారంభం

- June 01, 2020 , by Maagulf
ఒమన్ లో సాధారణ ఆరోగ్య సేవలు తిరిగి ప్రారంభం

మస్కట్:లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తున్న ఒమన్ ప్రభుత్వం..సాధారణ ఆరోగ్య సేవలను కూడా పునరుద్ధరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే..సాధారణ పరిస్థితుల నెలకొంటుండటంతో ఇవాళ్టి నుంచి ఆస్పత్రుల్లో వైద్య సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సలెహ్ ఆరోగ్య కేంద్రం, దహరిజ్ ఆరోగ్య కేంద్రంతో పాటు కుబుత్ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఉదయం నుంచి రోగులకు సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com