అబుధాబి: Dh15 మిలియన్లతో బిగ్ టికెట్ క్యాష్ ప్రైజ్, మరో 15 మంది కన్సోలేషన్ బహుమతులు
- June 02, 2020
భారీ బంపర్ డ్రాతో పాటు అదనపు క్యాష్ ప్రైజ్ లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ టికెట్ నిర్వాహకులు . జులై నెలకి సంబంధించి అబుధాబి వేదిక జరిగే ఈ బంపర్ డ్రాలో జాక్ పాట్ విన్నర్ ప్రైజ్ మనీ DH15 మిలియన్లుగా ప్రకటించారు. బంపర్ డ్రాతో పాటు మరో 15 మందికి కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించనున్నారు. బిగ్ టికెట్ డ్రా చరిత్రలో ఇదే అత్యధికం కావటం విశేషం. ఎక్కువ సంఖ్యలో కన్సోలేషన్ బహుమతులు ఇవ్వటం ద్వారా తమ వినియోగదారుల్లో ఎక్కువ మందికి డ్రాలో విజయం సాధించే అవకాశం కలిపించినట్లు అవుతోందని...ఇది తమ వినియోగదారుల సంఖ్యను కూడా పెంపొందించేందుకు దోహదపడుతుందని బిగ్ టికెట్ నిర్వాహకులు వెల్లడించారు. పలు రకాల గ్రాండ్ ప్రైజ్ లతో ప్రతి నెల తమ వినియోగదారుల్లో ఉత్సుకత రేకెత్తించేలా కొత్త మార్గాలను అణ్వేషిస్తూనే ఉంటామని తెలిపారు. DH15 మిలియన్లు జాక్ పాట్ విన్నర్ తో పాటు 15 క్యాష్ ప్రైజ్ లు గెలుచుకునే డ్రా కోసం తాము కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు బిగ్ డ్రా నిర్వాహకులు చెబుతున్నారు. కన్సోలేషన్ ప్రైజ్ మనీ గెలుచుకునే వారిలో ముగ్గురికి DH 100,000 నగదు బహుమతులు, ఇద్దరికి DH 80,000 బహుమతులు, మరో ముగ్గురికి DH 75,000, DH 50,000, DH 25 వేల నగదు బహుమతులు కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..