శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి...
- June 02, 2020
తిరుమల:శ్రీవారి దర్శనానికి భక్తులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో తిరుమలకు భక్తులును వెళ్లకుండా నిలిపివేశారు. అయితే, లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో భక్తులకు అనుమతి లభించింది. అయితే, ముందుగా శ్రీవారి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే, కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు ఆరు అడుగులు దూరం పాటించాలని అన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం తెలిపింది. భక్తులు దర్శనానికి అనుమతి కోరుతూ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







