అధిక చార్జీలు వసూలు చేస్తున్న చార్టర్లు..అనుమతించబోమన్న భారత కార్యాలయాలు

- June 02, 2020 , by Maagulf
అధిక చార్జీలు వసూలు చేస్తున్న చార్టర్లు..అనుమతించబోమన్న భారత కార్యాలయాలు

అబుధాబి: వందే భారత్ మిషన్ లో భాగంగా నడిపే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల సగటు ఛార్జీలు 725 దిర్హాములు. యూఏఈ లోని కొందరు వ్యాపారవేత్తలు, కమ్యూనిటీ సంఘాలు చార్టర్ విమానాలు ఏర్పాటు చేస్తూ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు సాయం అందిస్తున్నారు. కాగా, ఈ చార్టర్ విమానాల చార్జీలు వందే భారత్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన విమానాల టికెట్ ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయడానికి అనుమతించబడవు అని ఒక ఉన్నత దౌత్యవేత్త చెప్పారు.

యూఏఈ లోని భారత్ రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ "భారతీయులను రాష్ట్రానికి తీసుకెళ్లే చార్టర్ విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఛార్జీల పరిమితిని విధించింది. ఈ పరిమితులను అతిక్రమించబోమని ఆపరేటర్ హామీ ఇవ్వవలసి ఉంటుంది. యూఏఈ లోని భారత మిషన్లను ఏ సంస్థ అయినా సంప్రదించినప్పుడు ఈ కొత్త షరతు పాటించాల్సి ఉంటుంది లేదా రాష్ట్రం అనుమతి ఇవ్వదు. కొత్తగా ప్రకటించిన ఛార్జీల పరిమితి రాబోయే రోజుల్లో చార్టర్ చేయబడే విమానాలకు వర్తిస్తుంది." అని కపూర్ స్పష్టం చేశారు.

అధిక చార్జీలు వసూలు చేస్తున్న చార్టర్లు

యూఏఈ లోని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కెఎంసిసి) లోని వివిధ యూనిట్ల ద్వారా 160 మంది ప్రయాణికులను జూన్ 2 మరియు జూన్ 3 న ఇప్పటికే కేరళకు రెండు చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేశారు. వీటి టికెట్ ధర 1,250 దిర్హాములు వసూలు చేస్తున్నట్టు కెఎంసిసి యూఏఈ అధ్యక్షుడు పుతు రెహ్మాన్ ధృవీకరించారు.

అధిక చార్జీలు ఎందుకు?

"గో ఎయిర్ నుండి మాకు అతి తక్కువ ఛార్జీల ఒప్పందం (Dh900) వచ్చింది. కానీ భారత ప్రభుత్వం ఆ విమానయాన సంస్థకు అనుమతి ఇవ్వలేదు. మేము చాలా చర్చల తరువాత స్పైస్ జెట్ నుండి ఈ ఛార్జీని పొందగలిగాము. దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాలలో హ్యాండ్లింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నందున, ఈ విమానాలను రస్ అల్ ఖైమా నుండి ఏర్పాటు చేయటం జరిగింది.” అని పుతు రెహ్మాన్ తెలిపారు.

అర్హులైన వారికి సాయం..

పుతు రెహ్మాన్ మాట్లాడుతూ "చార్జీల భారాన్ని భరించలేని 10 శాతం మంది ప్రయాణీకులకు మేము ఉచిత టిక్కెట్లు ఇస్తున్నాము. సహాయాన్ని అర్ధించే అర్హులు ఎక్కువ సంఖ్యలో ఉన్న, మేము సాయం అందించేందుకు సిద్ధం. కానీ, ఛార్జీలను జాతీయ క్యారియర్ నడుపుతున్న విమానాలకు సమానంగా ఉంచడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రతిపాదించిన టికెట్ ధరతో కేరళకు ఎటువంటి చార్టర్ విమానాలు ప్రయాణించలేవు. ఛార్జీలను మరింత తగ్గించడానికి మరియు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందటానికి KMCC వైమానిక సంస్థలతో తిరిగి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తుంది" అని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com