చెన్నైకి చెందిన దిలీపన్ జాతీయ జెండాను తగలబెట్టాడు!
- January 31, 2016
చెన్నైలో ఇటీవల జరిగిన వైద్య విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఓ యువకుడు గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను తగలబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన దిలీపన్ అనే యువకుడు మెడికోలు, హైదరాబాద్‌లో రోహిత్ వేముల ఆత్మహత్యల విషయంలో వెంటనే చర్య తీసుకోవాలంటూ జాతీయ జెండాను తగలబెట్టాడు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీపన్ పోస్ట్ చేసిన ఫొటోలు తొలగించాడు. పోలీసులు అతని కోసం గాలించి చివరికి అరెస్ట్ చేశారు. తమిళ జాతీయవాది అయిన దిలీపన్ అరెస్ట్ మరో ఆందోళనకు తెరతీసింది. కొందరు అతని అరెస్టును వ్యతిరేకిస్తూ జాతీయ జెండాను అవమానపరిచినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో పక్క అతని మీద ఫిర్యాదు చేసినవాళ్లేమో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకముందు ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







