భారత సంతతికి చెందిన నీల్ ప్రకాశ్ సిరియాలో హతo
- January 31, 2016
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ రిక్రూటర్, భారత సంతతికి చెందిన నీల్ ప్రకాశ్ సిరియాలో హతమైనట్లు ఆస్ట్రేలియా మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్ టెలిగ్రామ్ ద్వారా ప్రకాశ్ మరణవార్త బయటకొచ్చింది. మరోవైపు ఐఎస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రకాశ్ అలియాస్ అబు ఖలీద్ అల్ కాంబోడి మరణించినట్లు ఐఎస్ ప్రకటించింది. అయితే ప్రకాశ్ ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడన్న దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. మరోవైపు అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మెల్‌బోర్న్‌కు చెందిన ప్రకాశ్‌కి ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే 2013లో ప్రకాశ్ సిరియాకు పారిపోయాడు. అనంతరం అక్కడ పేరు మార్చుకుని.. ఐఎస్‌లో సభ్యులను తీసుకునేందుకు రిక్రూట్‌మెంట్ బాధ్యతలు చేపట్టాడు. మొదట సోషల్‌మీడియా ద్వారా ఐఎస్ నియామకాలు చేపట్టేవాడు. అయితే భద్రత దృష్ట్యా ప్రకాశ్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని మార్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకాశ్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







