ఏపీలో 4 కరోనా మరణాలు..
- June 03, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది .. విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 180 నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్-19 వల్ల నలుగురు చనిపోయారు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3279కు చేరాయి. మరో 35మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 967కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







