నిమ్స్‌లో కరోనా కలకలం: నలుగురు వైద్యులు, ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా
- June 03, 2020
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. నలుగురు వైద్యులతో పాటు ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కరోనా సోకడంతో కలకలం రేపుతోంది. గాంధీ ఆసుపత్రిని కేవలం కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కేటాయించింది.
నిమ్స్ లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఈ నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని కూడ క్వారంటైన్ కు తరలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాటికి కరోనా కేసులు 2891కి చేరుకొన్నాయి మంగళవారం నాడు కొత్తగా 99 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 80కి పైగా నమోదౌతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలను దాటాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







