మంచు,చలి గుప్పిట్లో గల్ఫ్ దేశాలు
- January 31, 2016
ఎముకలు కొరికె చలిలో పనులు చేస్తున్న ప్రజలు గతవారం రోజులుగా గల్ఫ్ దేశాలు తీవ్ర చలితో అల్లాడుతుండగా కొన్ని దేశాలలో మంచు కురుస్తుండడంతో పౌర జీవనం స్తంభించిపోయింది. సౌదీ అరేబియా మరియు కువైట్‌లోని కొన్ని ప్రాంతాలలో మంచు విపరీతంగా కురుస్తోంది. చలి కారణంగా నీళ్ళు గడ్డ కట్టడంతో నీళ్లు తాగడానికి కూడా ప్రజలు వెనుకాడుతున్న పరిస్థితి. ఎడారులలో ఒంటెలు కాసే పశువుల కాపరులు మరియు రోడ్లు, నీటి సరఫరా ప్రాజెక్టులలో పని చేసే వారి పరిస్ధితి అత్యంత ఘోరంగా ఉంది. సౌదీ అరేబియాలోని తబూక్, ఆరార్, ఉత్తరాది ప్రాంతాలలో గత వారం రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా ఈ ప్రాంతాలలోని వ్యవసాయ క్షేత్రాలు మరియు నిర్మాణ రంగ సైటులలో పని చేస్తున్న ప్రవాసీ కార్మికుల పరిస్ధితి దయనీయంగా ఉంది.
మైనస్ 10 డిగ్రీల చలి మరియు మంచులో బయట అడుగు పెట్డడమె కష్టంగా ఉండగా తవ్వకం పనులు చేయడం ఎలా అని ఆరార్‌లోని నీటి చలి మరియు మంచుతో గిరాకి లేకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నట్లు ప్రజలు తెలిపారు.ఎడారులలో తీవ్ర చలి కారణాన వేడి కోసం తమ తమ గదులలో బొగ్గు కుంపట్లు పెట్టుకోవడంతో పొగ ఎక్కువయి ఊపిరాడక మరణించే భారతీయ కార్మికుల సంఖ్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. మంచు కారణంగా రియాధ్, దమాం, కువైత్ మరియు ఇతర అనేక నగరాలలో పాఠశాలలో ఉదయం వేళ ప్రార్ధన, ప్రతిజ్ఞ కార్యక్రమాలను రద్దు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







