వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కు లు..
- January 31, 2016
వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు యాడ్‌లాబ్స్ ఇమాజికా తెలిపింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ ఆకర్షించేలా.. డిస్నీ వరల్డ్ తరహాలో యాడ్‌లాబ్స్ భారత్‌లో థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2013లో ముంబయి - పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ పార్కు ఉంది. అయితే ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో భారత్‌లో మరో రెండు పార్కులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్తర, దక్షిణ భారత్‌లో వీటిని ఏర్పాటు చేస్తామని యాడ్‌లాబ్స్ సీఈవో, డైరెక్టర్ కపిల్ బగ్లా తెలిపారు. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఒకటి, హైదరాబాద్ లేదా బెంగళూరులో ఒక థీమ్ పార్కును నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతేగాక.. ప్రస్తుతమున్న పార్కులోనూ మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







