కరోనాపై పోరాటం: వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తులకు ఐదేళ్ల జైలుశిక్ష..లక్ష దిర్హామ్ జరిమానా
- June 07, 2020
యూఏఈ:కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా యూఏఈ ప్రభుత్వం గత చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగాగానీ, నిర్లక్ష్యంతోగానీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైతే..వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించనుంది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించేలా ఇతరులు ఉద్దశ్యపూర్వకంగా వ్యాధులను వ్యాప్తి చెందించటం నేరం. ఇందులో భాగంగానే గత ఆరేళ్ల క్రితమే యూఏఈ ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కావాలని అంటువ్యాధులను వ్యాప్తి చెందేలా చేసిన వారికి 50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించొచ్చు. అలాగే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ ఈ నేరం మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతోంది. ఇక అంటువ్యాధి బారిన పడి సదరు వ్యక్తి చనిపోతే..వ్యాధి వ్యాప్తికి కారణమైన వ్యక్తికి మరో మూడేళ్లు అదనంగా జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







