గల్ఫ్ నుండి తెలుగు రాష్ట్రాలకు మరిన్ని విమానాలు నడపాలి - గల్ఫ్ జనసేన విన్నపం
- June 07, 2020
గల్ఫ్: 'గల్ఫ్ సేన-జనసేన' ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలు అయిన యూఏఈ, ఒమాన్, కువైట్, కతర్, బహ్రెయిన్, సౌదీఅరేబియా నుంచి ముఖ్య జనసేన నాయకులు, పార్టీ పెద్ద అయిన నాదెండ్ల మనోహర్ తో జూమ్ యాప్ ద్వారా ఆత్మీయ సమావేశము అయ్యారు. ఈ సమావేశంలో గల్ఫ్ దేశాల నుండి సుమారు 200 మంది జనసైనికులు పాల్గొని వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుత కరోనా సమయములో వివిధ ప్రాంతాల్లో జనసైనికులు చేస్తున్న సేవలు అలాగే గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలకు ఏ విధముగా జనసేన సహాయసహకారాలు అందిస్తుంది అన్న అంశముపై నాదెండ్ల మనోహర్ జనసైనికులును అడిగి తెలుసుకుని తగు సూచనలు, సలహాలు అందజేశారు.

సమావేశంలో చర్చించిన అంశాలు:
* కరోనా సమయంలో ముఖ్యముగా తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ విమానసర్వీస్ లు నడిపి మరింత మందికి సదుపాయము అందేటట్టు చూడాలి.
* స్వదేశానికి వచ్చిన గల్ఫ్ వాసులను వివక్ష చూపకుండా ప్రేమతో మెలగాలి.
* స్వదేశానికి వచ్చిన గల్ఫ్ వాసులను క్వారంటైన్ పేరుతో డబ్బులు వసులు చేయడం తగదు.
* గల్ఫ్ ప్రాంత తెలుగు కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీ సులభతరం చేసి అందరూ లాభపడేటట్టు ఆలోచన చేయాలి.
తెలిపిన అన్ని అంశాలు సానుకూలంగా విన్న మనోహర్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియచేస్తానని చెపుతూ, త్యరలో 'గల్ఫ్ సేన-జనసేన' ను కలుపుతూ ఓ కమిటీ వేసి దానిని పార్టీకు అనుసంధానపరుస్తాము అని హామీ ఇచ్చారు.

సమావేశంలో పాల్గొన్నవారు:
దుబాయ్ నుంచి కేసరి త్రిమూర్తులు కోఆర్డినేట్ చేయగా, అమలాపురం పార్లమెంటరీ జనసేన నాయుకులు శెట్టిబత్తుల రాజబాబు కావాల్సిన సహాయసహకారాలు పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వడము జరిగింది. ఈ సుమావేశములో జనసేన నాయకులు రామదాసు చందాక (ఒమాన్-మస్కట్), మురళీకృష్ణ, వీరబాబు, దొర (కతర్ -దోహా), బాలాజీ (కువైట్), రాయుడు (బహ్రెయిన్), భాస్కర్ (రియాద్-సౌదీ), జానుబాబు (ఫుజైరా-యూఏఈ) తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







