తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు
- June 09, 2020
హైదరాబాద్:తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 3,920కు చేరింది. మొత్తంగా 148మంది ప్రాణాలు కోల్పోగా, 1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన కేసుల్లో 143 GHMC పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 15, మేడ్చల్లో 10, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్లో రెండేసి చొప్పున నమోదు కాగా, జగిత్యాల, అసిఫాబాద్, సిరిసిల్లా, వరంగల్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







