ఉష్ణోగ్రత పరిశీలించేందుకు స్మార్ట్‌ హెల్మెట్స్‌

- June 10, 2020 , by Maagulf
ఉష్ణోగ్రత పరిశీలించేందుకు స్మార్ట్‌ హెల్మెట్స్‌

జెడ్డా: థర్మల్‌ రేడియేషన్‌ పరిజ్ఞానంతో స్మార్ట్‌ హెల్మెట్స్‌ ద్వారా, సమీపంలోనున్న వ్యక్తుల ఉష్ణోగ్రతల్ని పరిశీలించవచ్చు. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ మునిసిపాలిటీ, ఈ తరహా హెల్మెట్ల వినియోగాన్ని ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ మేయర్‌ ఫవాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ జుబైర్‌ మాట్లాడుతూ, థర్మల్‌ రేడియేషన్‌ని ఉపయోగించి ఐదు మీటర్ల దూరంలో వున్నవారి ఉష్ణోగ్రతను పరిశీలించేలా ఈ స్మార్ట్‌ హెల్మెట్లు రూపొందినట్లు చెప్పారు. నిమిషానికి 200 మంది వ్యక్తుల ఉష్ణోగ్రతల్ని ఇవి పరిశీలిస్తాయి. ఎవరికైనా జ్వరం వుంటే వెంటనే అలర్ట్‌ చేస్తాయి. ఈ మేరకు పలువురు మునిసిపాలిటీ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు ఆయన వివరించారు. అధిక ఉష్ణోగ్రత కలిగి వున్నట్లు ఏ వ్యక్తినైనా గుర్తిస్తే, హెల్త్‌ అథారిటీస్‌ తగిన చర్యలు తీసుకుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com