కరోనా ఎఫెక్ట్‌: మరింతమంది ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించిన ఎమిరేట్స్‌

- June 10, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: మరింతమంది ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించిన ఎమిరేట్స్‌

దుబాయ్:ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్‌ హాల్‌ ఎయిర్‌లైన్‌ ఎమిరేట్స్‌, మరింత మంది ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ లే-ఆఫ్‌ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే విధిలేని పరిస్థితుల్లో లే-ఆఫ్‌ ప్రకటిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎమిరేట్స్‌ సంస్థ 60,000 మందికి పైగా ఉద్యోగుల్ని కలిగి వుంది. మే 31న ఓసారి ఎమిరేట్స్‌ ఉద్యోగుల లే-ఆఫ్‌ని ప్రకటించిన విషయం విదితమే. కాగా, గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ 84.3 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఈ ఏడాది చవిచూడటం జరిగింది. ఏవియేషన్‌ రంగంలోనే అతి పెద్ద నష్టంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ పరిస్థితిని ఎలా అభివర్ణించాలో అర్థం కావడంలేదని పౌర విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com