ఉష్ణోగ్రత పరిశీలించేందుకు స్మార్ట్ హెల్మెట్స్
- June 10, 2020
జెడ్డా: థర్మల్ రేడియేషన్ పరిజ్ఞానంతో స్మార్ట్ హెల్మెట్స్ ద్వారా, సమీపంలోనున్న వ్యక్తుల ఉష్ణోగ్రతల్ని పరిశీలించవచ్చు. ఈస్టర్న్ ప్రావిన్స్ మునిసిపాలిటీ, ఈ తరహా హెల్మెట్ల వినియోగాన్ని ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈస్టర్న్ ప్రావిన్స్ మేయర్ ఫవాద్ బిన్ మొహమ్మద్ అల్ జుబైర్ మాట్లాడుతూ, థర్మల్ రేడియేషన్ని ఉపయోగించి ఐదు మీటర్ల దూరంలో వున్నవారి ఉష్ణోగ్రతను పరిశీలించేలా ఈ స్మార్ట్ హెల్మెట్లు రూపొందినట్లు చెప్పారు. నిమిషానికి 200 మంది వ్యక్తుల ఉష్ణోగ్రతల్ని ఇవి పరిశీలిస్తాయి. ఎవరికైనా జ్వరం వుంటే వెంటనే అలర్ట్ చేస్తాయి. ఈ మేరకు పలువురు మునిసిపాలిటీ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు ఆయన వివరించారు. అధిక ఉష్ణోగ్రత కలిగి వున్నట్లు ఏ వ్యక్తినైనా గుర్తిస్తే, హెల్త్ అథారిటీస్ తగిన చర్యలు తీసుకుంటాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







