భారత్ లో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...

- June 12, 2020 , by Maagulf
భారత్ లో రికార్డ్ స్థాయిలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు...

 భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.  రోజు 9 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి  తెలిసిందే.  అయితే, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.   గడిచిన  24 గంటల్లో 10,964 కేసులు నమోదయ్యాయి.  దీంతో  భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,535 కి చేరింది.  ఇక ఒక్కరోజులో 396  మంది కరోనా వలన మరణించారు. దీంతో మరణాల సంఖ్య 8,498కి చేరింది.  దేశంలో  యాక్టివ్ కేసులు 1,41,842 ఉంటె, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  1,47,194 గా ఉండటం విశేషం.యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి. పాకిస్థాన్ లో 5 వేలకు పైగా దాటిన కరోనా పాజిటివ్ కేసులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com