పైప్‌లైన్‌ ప్రమాదంలో ఆరుగురు కార్మికుల మృతి

- June 12, 2020 , by Maagulf
పైప్‌లైన్‌ ప్రమాదంలో ఆరుగురు కార్మికుల మృతి

రియాద్‌: అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ పైప్‌లైన్‌ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘటన రియాద్‌లోని అజిజియాహ్‌లో చోటు చేసుకుంది. రియాద్‌ సివిల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిది¸ వెల్లడించిన వివరాల ప్రకారం, అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ పైప్‌లైన్‌ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 400 మీటర్ల పొడవున్న పైప్‌లైన్‌లో ఆరుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది పైప్‌లోలైన్‌లో చిక్కుకుపోయినవారిని అచేతనావస్థలో బయటకు తీయడం జరిగింది. కాగా, మెడికల్‌ టీమ్స్  ఆ ఆరుగుర్ని పరీక్షింగా, అప్పటికే వారు మృతి చెందినట్లు తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com