దుబాయ్:వైటల్‌ సెక్టార్‌ స్టాఫ్‌కి బోనస్‌

- June 15, 2020 , by Maagulf
దుబాయ్:వైటల్‌ సెక్టార్‌ స్టాఫ్‌కి బోనస్‌

దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్, మంత్రులతో వర్చువల్‌ క్యాబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. వైటల్‌ సెక్టార్స్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దరిమిలా, పలు అంశాలపై ఈ క్యాబినెట్‌ సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం యూనియన్‌ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు క్యాబినెట్‌ మీటింగ్‌లో ఆయన ప్రకటించారు. ఎమర్జన్సీ సమయంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ఆయా రంగాలకు చెందినవారికి బోనస్‌లు ఇచ్చేందుకూ క్యాబినెట్‌ తీర్మానించింది. ఎమిరాతీలు అలాగే రెసిడెంట్స్‌ కోసం ఆయా విభాగాలు చాలా కష్టపడ్డాయనీ, ప్రతి ఒక్కరి కష్టం వల్లే సంక్షోభం నుంచి బయటపడగలిగామని షేక్‌ మొహమ్మద్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com