దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మళ్ళీ నెంబర్‌ వన్‌

- February 01, 2016 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మళ్ళీ నెంబర్‌ వన్‌


దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మరోమారు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ హబ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌గా నిలిచింది. 2015లో 78 మిలియన్‌ ప్రయాణీకులతో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిత్యం రద్దీగా కనిపించింది. 100కి పైగా ఎయిర్‌లైన్స్‌, 240కి పైగా డెస్టినేషన్స్‌తో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణీకులకు సేవలందిస్తోంది. 2014లో 70,473,893 ప్రయాణీకులకు సేవలందించిన ఈ ఎయిర్‌పోర్ట్‌, 2015లో 10.7 శాతం అదనంగా అంటే 78,014,838 మంది ప్రయాణీకులకు సేవలందించింది. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మూమెంట్‌ పరంగా చూస్తే, 2014లో 353,507 ఉంటే, 2015లో 403,517గా నమోదైంది. సింగిల్‌ లార్జెస్ట్‌ డెస్టినేషన్‌ విభాగంలో ఇండియా నిలిచింది. 2015లో 10,391,376 మంది ప్రయాణీకులు ఇండియాకి వెళ్ళారు. గత ఏడాదితో పోల్చితే ఇది 17 శాతం అదనం. యూకే డెస్టినేషన్‌ విభాగంలో రెండో స్థానం దక్కించుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com