ముంబైలో తెలంగాణ వలసకార్మికుల సమావేశం

- February 01, 2016 , by Maagulf
ముంబైలో తెలంగాణ వలసకార్మికుల సమావేశం


ముంబైలోని ఆంధ్ర మహాసభ హాల్ నందు ఆదివారం (31 జనవరి 2016) తెలంగాణ వలసకార్మికుల సేవాసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల క్రితం మహారాష్ట్ర కు బతుకుదెరువుకోసం వచ్చిన తెలంగాణవారు స్థానిక మరాటీ ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నారని, మహారాష్ట్ర సంస్కృతితో మమేకమై, తమ తెలంగాణ భాషా, సంస్కృతులను కాపాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తాను తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బసంత్ రెడ్డిని 'ముంబై-తెలంగాణ' వలసకార్మికుల కోఆర్దినేటర్ గా నియమించి సన్మానించారు.  ఈ సమావేశంలో నల్ల రాధా కృష్ణ, మచ్చ ప్రభాకర్, రవీందర్, బత్తుల లింగం,  'తెలంగాణ జాగృతి' మహారాష్ట్ర విభాగం కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని 'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com