కువైట్:గత వారం నాటికి దేశం నుంచి 21,163 మంది అక్రమ నివాసితుల తరలింపు

- June 16, 2020 , by Maagulf
కువైట్:గత వారం నాటికి దేశం నుంచి 21,163 మంది అక్రమ నివాసితుల తరలింపు

సరైన అనుమతులు లేకుండా నివసిస్తున్న 80 శాతం మంది ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించింది కువైట్ ప్రభుత్వం. ప్రస్తుతం 26,472 మంది ప్రవాసీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించి కువైట్ లో ఉంటున్నారు. అయితే..కరోనా నేపథ్యంలో వాళ్లందరికీ క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసింది. నిర్ణీత గడువులోగా వారి సొంత దేశాలకు వెళ్తే ఎలాంటి శిక్షలు ఉండవని గతంలోనే ప్రకటించింది. దీంతో అక్రమ నివాసితులు వారి వారి సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు.

గత వారం నాటికి 21,163 మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారిని కూడా వారి వారి దేశాలకు తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే కువైట్ లో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వాళ్లలో ఎక్కవగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 7,181 మంది భారతీయులు ఉంటే..5,799 మందిని ఇప్పటికే స్వదేశానికి తరలించారు. మరో 1,204 మందిని తరలించాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com