కువైట్: ఆఫీసుల కార్యాకలాపాల నిర్వహణకు మార్గనిర్దేశకాలు జారీ చేసిన సివిల్ సర్వీస్ కమిషన్
- June 16, 2020
కువైట్ సిటీ:కరోనా అలజడి తర్వాత తిరిగి సాధారణ పరిస్థితుల నెలకొల్పడంలో భాగంగా కువైట్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆఫీసుల నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలపటంతో కార్యకలాపాల విధి విధానాలపై సివిల్ సర్వీస్ కమిషన్ తగిన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఆఫీసులలో పని విధానాలను బట్టి వారికి అనుకూలంగా ప్రత్యేకంగా విధానాలు అవలంభించొచ్చని సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే..ఆయా కార్యాలయాల్లో పాటించే విధానాలు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉండాలని కూడా సూచించారు. వారం షెడ్యూల్ విధానాన్ని అవలంభించాలని, ఒక వారం కొందరు..మరో వారం మరికొందరు విధులకు హజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది. పని విధానాన్ని బట్టి వారం షెడ్యూల్ లో మినహాయింపులు ఉంటాయని కూడా వెల్లడించింది. అయితే..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సూచించిన గరిష్ట సంఖ్యను దాటి ఏక కాలంలో ఉద్యోగులు విధులకు హజరుకావొద్దని కూడా సూచించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







