భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత..ఇద్దరు జవాన్లు మృతి
- June 16, 2020
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరిహద్దులో భారత్ సైన్యంపై చైనా ఆర్మీ తెగబడింది. గాల్వాన్‌లోయ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగింది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో భారత సైనికులపై చైనా కాల్పులకు దిగింది. చైనా ఏకపక్ష కాల్పుల్లో ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరికొంతమంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా లదాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య గతకొంత కాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ నివేదికల ప్రకారం.. ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. చైనా కాల్పులను తిప్పికొట్టే విధంగా బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







