ఫ్యామిలీ ప్యాక్ మోషన్ పోస్టర్ విడుదల
- June 16, 2020
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మోషన్ పోస్టర్ చూస్తుంటే యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుందీ చిత్రం.ఈ ఫస్ట్ లుక్ కోసం ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టింది యూనిట్.
‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మూవీ మోషన్ పోస్టర్ ని చూసి అక్కడ కనిపిస్తున్న జంట రిలేషన్ ఎంటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన 5 మందికి జె.బి.ఎల్ స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. దీని కోసం ట్విట్టర్ లో #FamilyPack అని టైప్ చేసి సెర్చ్ చేసి కామెంట్ చేయవచ్చు.
పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ,లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇంతకు ముందు లిఖిత్ శెట్టి-అర్జున్ కుమార్ కలిసి ‘‘సంకష్టకారా గణపతి’’ అనే మూవీ తీసారు. 2018 లో అమెజాన్ లో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు