మీరు మాట్లాడితే.. అది ట్వీట్ అవుతుంది

- June 18, 2020 , by Maagulf
మీరు మాట్లాడితే.. అది ట్వీట్ అవుతుంది

హైదరాబాద్‌: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌లో ఇక వాయిస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానున్నది. ట్వీట్స్‌తో ద్వారా మీ వాయిస్‌ను రికార్డ్ చేయవచ్చు. ట్విట్టర్ హోమ్‌పేజీపై ఓ కొత్త ఐకాన్‌ను యాడ్ చేశారు. అది మన వాయిస్ వేవ్‌లెన్త్‌ను గ్రహించి ట్వీట్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉన్నది. ఒక సింగిల్ ట్వీట్‌లో.. సుమారు 140 సెకండ్ల వాయిస్‌ను అందుకునే విధంగా ఆ ఫీచర్‌ను డెవలప్ చేశారు.

ఈ కొత్త ఫీచర్ తొలుత కేవలం యాపిల్‌లోని ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొంతమందికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో వాయిస్ ఫీచర్‌ను మరికొంత మంది ఐఓఎస్ యూజర్లకు ఇవ్వనున్నారు. ట్విట్టర్ సంస్థ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పింది. స్క్రీన్‌పై ఉన్న వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా యూజర్ల.. వాయిస్ ట్వీట్ చేయవచ్చు అని ఆ పోస్టులో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com