జగన్నాథుడి రథయాత్ర కు సుప్రీం నో
- June 18, 2020
న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో చారిత్రక జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నెల 23 నుంచి జరుప తలపెట్టిన ఈ వేడుకలను కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఏటా సుమారు 10-12 రోజులపాటు సాగే పూరి జగన్నాథుడి రథయాత్రకు దేశ, విదేశాల నుంచి పది లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారు.
అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, న్యాయమూర్తులు దినీష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కరోనా సంక్షోభ సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు.. అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పౌరుల రక్షణ దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని థర్మాసనం ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని, భక్తులను అనుమతించవద్దని పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







