ఆసక్తి రేపుతున్న నిహారిక పోస్ట్..వరుడెవరో మరి!?
- June 18, 2020
టాలీవుడ్‌లో పెళ్లిసందడి మొదలయ్యింది. మొన్న ప్రొడ్యూసర్ దిల్‌రాజు, నిఖిల సిద్దార్థ వివాహం. నిన్న నిఖిల్ పెళ్లి. ఈ ఏడాది డిసెంబర్‌లో రానా దగ్గుబాటి వివాహమని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ ఇంటి నుంచి పెళ్లి కబురు అందింది. నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల పెళ్లి గురించి ఎప్పటినుంచో సోషల్ మీడి యాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఈసారి స్వయంగా నీహారిక స్వయంగా తన వివాహ విషయాలన్ని ప్రస్తావించారు.
గత కొద్దిరోజులుగా నిహారిక పెళ్లి వార్తలపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆమె చేసిన పోస్ట్‌లో.. ఓ కాఫీ కప్‌పై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మిస్ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్ అని రాసి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. ఈ నేపధ్యంలో ఆమె చేసుకోబోయే కుర్రాడు ఎవరు..ఏం చేస్తుంటాడు అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

అందుతున్న సమాచారం మేరకు నీహారిక వివాహం చేసుకోబోయే కుర్రాడు పేరు చైతన్య. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి వెళ్లి ఈ వివాహం పైనలైజ్ చేసారు. పెళ్లి కొడుకు ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో ఎగ్జిక్యుటివ్ గా పనిచేస్తున్నారు. ఓ పెద్ద పేరున్న కాలేజీలో మేనేజ్మెంట్ గ్యాడ్యుయేట్ గా చేస్తున్నారు.
ఇక నీహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ ఆగస్టులో జరగనుంది. వివాహం పిభ్రవరి 2021లో చేస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాసం ఉంది. గతంలో నాగబాబు తన కూతురి వివాహ విషయాలను ప్రస్తావించారు. 'వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నీహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం తనకో మంచి వరుణ్ని వెతికే పనిలో ఉన్నాం. నీహారిక పెళ్లి తర్వాత వరుణ్‌తేజ్ పెళ్లి గురించి ఆలోచిస్తాం. వీరిద్దరి పెళ్లిళ్లు అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది' అని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







