ఏ.పీలో పెరిగిన కరోనా కేసులు
- June 18, 2020
అమరావతి:ఏ.పీలో 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీంతో.. మొత్తం కేసులు 7 వేల 496కి చేరాయి. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఏపీకి చెందిన 299 మందిలోను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 100 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాలు 92కి చేరాయి. తాజాగా మృతి చెందిన ఇద్దరు కూడా కృష్ణా జిల్లా వారే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యాక్టివ్ కేసులు 2 వేల 779 ఉన్నాయి. 2 వేల 983 మంచి డిశ్చార్జ్ అయ్యారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







