మనీ లాండరింగ్‌ నిందితులపై కఠిన చర్యలకు ప్రాసిక్యూషన్‌ డిమాండ్‌

- June 18, 2020 , by Maagulf
మనీ లాండరింగ్‌ నిందితులపై కఠిన చర్యలకు ప్రాసిక్యూషన్‌ డిమాండ్‌

మనామా:మనీ లాండరింగ్‌కి సంబంధించి బాధ్యులైన బహ్రెయిన్‌ బేస్డ్‌ బ్యాంక్‌ అలాగే పలు ఇరానియన్‌ బ్యాంకులకు చెందిన అధికారులపై చట్టపరమైన చర్యలు మరింత కరినంగా వుండాలని ప్రాసిక్యూషన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ కేసులో విచారణను క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ జులై 27వ తేదీకి వాయిదా వేసింది. బహ్రెయిన్‌లోని ఫ్యూచర్‌ బ్యాంక్‌కి చెందిన ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్‌ అయి వున్నారు. మిగతా నిందితులు, ఇతర బ్యాంకులకు చెందినవారు. న్యాయస్థానం నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com