WHO హెచ్చరికలు... ప్రమాద దశలోకి ప్రపంచం
- June 20, 2020
జెనీవా:కరోనా వైరస్ వ్యాప్తి అతకంతకూ విస్తరిస్తోంది. దీంతో ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి వెళుతోంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని తెలిపారు. వీటిలో సగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్ అన్నారు. వైరస్ కట్టడికి లాక్డౌన్ శాశ్వత పరిష్కారం కాకపోయినా సడలింపుల అనంతరం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న తరుణంలో ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







