దుబాయ్ : భారత మృతదేహాల సమాచారంలో జాప్యం..స్పాన్సర్ల పట్ల దౌత్య కార్యాలయం అసంతృప్తి

- June 20, 2020 , by Maagulf
దుబాయ్ : భారత మృతదేహాల సమాచారంలో జాప్యం..స్పాన్సర్ల పట్ల దౌత్య కార్యాలయం అసంతృప్తి

కరోనా నేపథ్యంలో కొద్ది వారాలుగా మృతదేహాల స్వాధీనం చేసుకోవటంలోనూ..మృతులకు సంబంధించి సమాచారం అందించటంలోనూ యజమానులు, స్పాన్సర్లు, కుటుంబ సభ్యులు ఉద్దేశ్యపూర్వక ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది భారత దౌత్యకార్యాలయం. దీంతో కొందరి మృతదేహాలను ఇంకా మార్చురీలోనే ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు. స్థానిక అధికారుల నుంచి తమకు అందిన సూచనల మేరకు మృతదేహాలను తప్పనిసరిగా క్లేయిమ్ చేసుకోవటం ద్వారా వారి అంతిమసంస్కారాలు నిర్వహించటం లేదా స్వదేశాలకు తరలించటం వీలు అవుతుందన్నారు. ఒక వేళ మృతదేహాల స్వాధీనం చేసుకోకపోతే
స్థానిక చట్టాల మేరకు అంతిమసంస్కారాలు నిర్వహిస్తామని కూడా లోకల్ అధికారులు భారత దౌత్య కార్యాలయానికి సమాచారం అందించారు. అయితే..ఏవరైనా మృతిచెందింతే స్పాన్సర్లు, యజమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకే మొదటగా సమాచారం చేరవేస్తారు. కానీ, ఆ సమాచారాన్ని యజమానులు, స్పాన్సర్లు కాన్సులేట్ కు చేరవేయటం లేదు. ఈ నేపథ్యంలో యజమానులు, స్పాన్సర్ల బాధ్యతారాహిత్య చర్యల పట్ల భారత దౌత్యకార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా కరోనా మరణాల నేపథ్యంలో తమకు సమాచారం అందించటంలో జాప్యం చేస్తున్న యజమానులు, స్పాన్సర్ల కారణంగా మార్చురీలపై కూడా భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఒకవేళ భారత్ కు చెందిన వలస కార్మికులు, ప్రవాసీయులు ఏ కారణం చేతనైనా మృతిచెందితే..ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా తమకు చేరవేయాలని యజమానులు, స్పాన్సర్లను భారత దౌత్యకార్యాలయం తెలిపింది. +971-507347676 అత్యవసర ఫోన్ నెంబర్ ద్వారా కూడా తమకు సమాచారం అందించవచ్చని లేదంటే... [email protected] అనే ఈ మెయిల్ ద్వారా కూడా మృతుల సమాచారం అందించ వచ్చని కోరింది. కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా బాధ్యయుతంగా వ్యవహరించి తమకు సకాలంలో సమాచారం అందించాలన్నారు. అయితే..కరోనా కారణంగా మృతిచెందితే మాత్రం దహనసంస్కారాలు స్థానికంగానే నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com