తెలంగాణలో కొత్తగా 546 కరోనా కేసులు
- June 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం రికార్డు స్థాయిలో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,072కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం కరోనాతో ఐదుగురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 203గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కొత్తగా వచ్చిన కేసుల్లో GHMC పరిధిలో 458 నమోదయ్యాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి 50, మెడ్చల్ 6, మహబూబ్‌నగర్ 3, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 1, జనగాంలో 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్‌లో ఒక కేసు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







