కల్న‌ల్ సంతోష్‌బాబుకు నివాళుల‌ర్పించిన హీరో విష్వ‌క్ సేన్‌

- June 21, 2020 , by Maagulf
కల్న‌ల్ సంతోష్‌బాబుకు నివాళుల‌ర్పించిన హీరో విష్వ‌క్ సేన్‌

స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ వ‌ద్ద చైనా సైనికుల‌తో జ‌రిగిన పోరులో అసులువు బాసి నేష‌న‌ల్ హీరోగా నిలిచిన వీర‌సైనికుడు క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని 'హిట్' సినిమా హీరో విష్వ‌క్ సేన్ ప‌రామ‌ర్శించారు. శ‌నివారం విష్వ‌క్ సేన్‌ సూర్యాపేట‌కు వెళ్లి, సంతోష్‌బాబుకు నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి, వారికి త‌న ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియ‌జేశారు. సంతోష్‌బాబు వంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయ‌న త‌ల్లికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా విష్వ‌క్ సేన్ మాట్లాడుతూ, "ఈ కుటుంబం చేసిన త్యాగం కేవ‌లం మ‌న ఒక్క‌ళ్ల కోసం కాదు, మ‌న రాష్ట్రం కోసం కాదు, మ‌న భార‌త దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మ‌నం రుణ‌ప‌డి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు త‌ల్లిని ఒక‌సారి క‌లుసుకోవాల‌ని అనిపించింది. క‌నీసం నేను ఆ త‌ల్లిని సంద‌ర్శించి, మ‌న సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృత‌జ్ఞ‌త‌లతో పాటు సంతాపాన్నీ తెలప‌గ‌లిగాను. కుమారుడిని కోల్పోయిన‌ ఆమె ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని ఊహించుకున్నా కూడా నా హృద‌యం త‌ల్ల‌డిల్లుతోంది. పూడ్చ‌లేని లోటు నుంచి కోలుకొని మ‌న వీర సైనికుల కుటుంబాల‌కు ఆత్మ స్థైర్యం ల‌భించాల‌ని ప్రార్థిద్దాం. జైహింద్‌" అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com