గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం వరకు 21.65 శాతం..
- February 02, 2016
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం నమోదయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. 9 గంటలవరకు తక్కువగా ఉన్న పోలింగ్ ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరడంతో ఓటింగ్ శాతంలో వృద్ధి కనిపిస్తోంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందన్నారు.పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీల నుంచి ఇప్పటివరకు 37 ఫిర్యాదులు అందాయని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలో 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.9 డివిజన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ వివరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







