భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ

- February 02, 2016 , by Maagulf
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పథకం పన్నింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవాల్లోని కీలక స్థావరాలపై గురిపెట్టింది. మహారాష్ట్ర ఉగ్రవాద నిర్మూలన దళం (ఏటీఎస్) విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి.భారత్ లో ఐసిస్ విభాగం చీఫ్ ముదబ్బీర్ షేక్, డిప్యూటీ నాయకుడు ఖలీద్ అహ్మద్ అలీ నవాజుద్దీన్ అలియాస్ రిజ్వాన్ తో కలసి షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ పథకం పన్నినట్టు మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఇండియన్ ముజాహిద్దీన్ నుంచి బయటకువచ్చి ఐసిస్ లో చేరిన యూసుఫ్‌ భారత్ లో యువకులను ఐసిస్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహారాష్ట్ర ఏటీఎస్ అధికారుల సమాచారం మేరకు ఆ రాష్ట్రంలో సురక్షితమైన ఇళ్ల కోసం ఐసిస్ ఉగ్రవాదులు గాలిస్తున్నారని, గోవాలోని ఓ రియాల్టీ ఏజెంట్ ను సంప్రదించారని తెలుస్తోంది.ముంబై, పుణె, గోవాలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై దాడికి పథకం పన్నారు. అలాగే మహారాష్ట్ర, గోవాల్లో విదేశీయులను ఐసిస్ టార్గెట్ చేసినట్టు భద్రతాధికారులు కనుగొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com