ఏపీలో 407 కరోనా పాజిటివ్ కేసులు
- June 23, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో మరో 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది
గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 8 మంది మరణించారు. కరోనాతో చనిపోయిన ఈ ఎనిమిది మంది కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందినవారుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 9834 మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడగా.. 4592 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 119 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 5123 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







